సోషల్ మీడియాలో రాజకీయ నాయకులపై అసభ్యకరమైన పోస్ట్లు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు అమృతలూరు ఎస్సై జానకి అమరవర్ధన్ ఆదివారం తెలిపారు. అమృతలూరు మండలం తురుమెళ్ల గ్రామానికి చెందిన బేతాళ కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. సిఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ లను కించిపరుస్తూ వారి కుటుంబ గౌరవం దిగజార్చే విధంగా ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టడంతో కేసు నమోదు చేశామన్నారు.