భట్టిప్రోలు మండల పరిధిలోని చినపులివర్రు గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శివ లింగాకారంలో దీపోత్సవం, నగర సంకీర్తన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు మాట్లాడుతూ.. కార్తీక మాసంలో దీపారాధన చేయటం వల్ల సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందన్నారు.