అమృతలూరులో నేటితో ముగిసిన హనుమజ్జయంతి ఉత్సవాలు

58చూసినవారు
మండల కేంద్రం అమృతలూరులో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాలు పులిపాక వంశీల ఆర్థిక సహకారంతో త్రయహ్నికముగా వైఖానసాగమ శాస్త్ర రీత్యా, పరాశరం రత్నమాచార్యులు ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో సోమవారం ముగింపు సందర్భంగా ఉదయం చూతఫల రసంతో స్నపన, గంధంతో స్నపన, ఫల సహస్రనామార్చన నిర్వహించారు. మాచిరాజు శేషగిరిరావు - విజయలక్ష్మి దంపతులు పూజాదికార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్