ఆపదలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. భట్టిప్రోలు మండలం పెద్దపులివర్రు గ్రామానికి చెందిన నీల వెంకటరామయ్య, నీలా కేశవరావు, కొల్లూరు గ్రామానికి చెందిన నల్లబండ తిరుపతమ్మ, కృష్ణవేణి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స చేయించుకోగా మంగళవారం వీరికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరైన రూ. 1, 32, 010 లను ఎమ్మెల్యే అందజేశారు.