ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ నేటి పర్యటన వివరాలు
వినుకొండ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో కలిసి నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారని కార్యాలయ ప్రతినిధులు ఓప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి వినుకొండ రూరల్ మీదుగా పెకంచెర్ల, ఏనుగుపాలెం, పిట్టంబండ, ఉమ్మడివరం, నాగులవరం, గోకనకొండ గ్రామాలకు చేరుకుంటుందని తెలిపారు. అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.