శావల్యాపురంలో వైద్య సిబ్బంది నిరసన
శావల్యాపురం మండల కేంద్రంలో వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన సంఘటనను నిరసిస్తూ ఆరోగ్య కేంద్రం ముందు వైద్య సిబ్బంది శనివారం నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, వైద్యశాల సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.