పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మండలంలోని వెల్లటూరు గ్రామంలో నివసిస్తున్న గోపాల్ ఇంట్లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇంట్లో సామాన్లు దగ్ధం అయినట్లు తెలిపారు. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.