రాజ్యాంగ దినోత్సవం వేడుకల్లో భాగంగా 'భావి భారత పౌరులం, రాజ్యాంగ రక్షకులం, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, రాజ్యాంగాన్ని ఆచరిద్దాం' అంటూ విద్యార్థులు వినుకొండలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ ప్రచార వేదిక కన్వీనర్ జుజ్జూరి ఐరామ్మూర్తి స్థానిక న్యాయవాదులు పీజే లూకా విజయ్, సుధాకర్ రెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయులు నాయకులు రమాచారి, రామయ్య పాల్గొన్నారు.