వినుకొండ మండలం చాట్రగడ్డపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగి ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని సోమవారం విచారణ చేపట్టారు. ఎస్ఐ మాట్లాడుతూ.. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించ పోయి ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి బాపట్ల జిల్లా ఏల్చూరుకు చెందిన నరసింహారెడ్డిగా గుర్తించామన్నారు.