వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై వైసీపీ కేడర్ ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తాను సీఎం చంద్రబాబుతో లైవ్ డిబేట్కు సిద్ధమని సవాల్ విసిరారు. చంద్రబాబును పలు ప్రశ్నలు అడుగుతానని, వాటికి సమాధానం చెబితే తాను లైవ్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.