ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. దీనిపై పవన్ సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి కాపు కులస్థులు 99 శాతం ఓటు వేసి గెలిపించారని ఆయన లేఖలో తెలిపారు. పవన్ వల్ల తమకు న్యాయం జరుగుతుందని కాపు కులస్థులు నమ్ముతున్నారన్నారు.