AP: పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగా ఉందని, విద్యార్థులు తాము చెప్పినట్లు వినడం లేదని విజయనగరం జిల్లా పెంట ZPHS HM రమణ గుంజీలు తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం మంత్రి లోకేశ్ దృష్టికి చేరడంతో హెచ్ఎంను ఆయన అభినందించారు. 'హెడ్ మాస్టర్ గారూ.. మనం ప్రోత్సహిస్తే ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయ క్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది. అభినందనలు. అందరం కలిసి విద్యా ప్రమాణాలు పెంచుదాం' అని ట్వీట్ చేశారు.