TG: హైదరాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్‌లో భార్య పద్మపై అనుమానంతో భర్త నరేంద్ర ఆమెను గొంతు నులిమి చంపేశాడు. భార్యపై అనుమానం పెంచుకున్న నరేంద్ర భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి జరిగిన ఘర్షణలో నరేంద్ర హత్య చేసి, పోలీసులకు లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.