టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించారు. ఇతర కెప్టెన్లతో పోలిస్తే రోహిత్ రికార్డు చాలా మెరుగ్గా ఉందని అన్నారు. రోహిత్ ఎందుకు రిటైర్ అవుతాడని ప్రశ్నించారు. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ అతనికి మంచి రికార్డుందని తెలిపారు. రోహిత్ రిటైర్ కావడానికి, అతడిని విమర్శించడానికి ఒక్క కారణమూ లేదని ఏబీడీ విమర్శలకు చెక్ పెట్టారు.