గుజరాత్‌లోని బోటాడ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గదడాలోని చోస్లా గ్రామ సమీపంలో గల కలుబర్ నదిలో స్నానానికి దిగి నలుగురు గల్లంతయ్యారు.రాజస్థాన్‌కు చెందిన పవన్ సింగ్, పృథ్వీ సింగ్‌తో పాటు మరో ఇద్దరు స్థానికంగా పనిచేస్తున్నారు. అయితే బుధవారం నదిలో స్నానానికి దిగగా ప్రవాహానికి నీటిలో మునిగిపోయారు. ఇద్దరి మృతదేహాలు బయటికి తేలడంతో మిగతా ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.