మాజీ మంత్రి విడదల రజిని క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు గురువారం విచారించనుంది. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి రూ. కోట్లలో ముడుపులు అందాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో తనకు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రజిని ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు నేడు విచారించనుంది.