ఉత్తరాఖండ్‌లో బుధవారం భారీ వర్షం కురిసింది. దాదాపు మూడు గంటల పాటు ఈదరుగాలులతో కూడిన భారీ వర్షానికి చామోలి జిల్లాలో కొండచరియాలు విరిగిపడ్డాయి. కొండ చరియలు విరిగి పడడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రాకపోకలను పునరుద్ధరించేందుకు సహాయక చర్యలు చేపట్టాయి.