ఏపీలో మళ్లీ వానలు దంచికొట్టనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో APలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. వచ్చే నాలుగు రోజులు ఏపీలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని వెల్లడించింది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పు గోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ పేర్కొంది.