ఫెంగల్ తుపాను ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు జేసీబీలతో బండరాళ్లను తొలగిస్తున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు భక్తులకు సూచిస్తున్నారు.