ఎన్నికల తర్వాత నా ప్రమాణ స్వీకారం ఇక్కడే: జగన్

1025చూసినవారు
ఎన్నికల తర్వాత నా ప్రమాణ స్వీకారం ఇక్కడే: జగన్
విశాఖపట్నంలో నిర్వహించిన విజన్ వైజాగ్ సభలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తానని అన్నారు. ఇక్కడే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. వైజాగ్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఎన్నికల తర్వాత తన నివాసం వైజాగ్ అని స్పష్టం చేశారు. అమరావతికి తాను వ్యతిరేకం కాదని, అమరావతి శాసన రాజధానిగా కొసాగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్