వైసీపీ చీఫ్ జగన్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత సవాల్ విసిరారు. ఆయనకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడాలని సూచించారు. ఇటీవల జరిగిన రాజకీయ హత్యలతో పాటు వివేకా మర్డర్‌పై కూడా చర్చిద్దామని అన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగన్ పాలనలో ఐదేళ్లు గంజాయి రాష్ట్ర పంటగా మారిందని విమర్శించారు.