ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(టెట్) గతంలో నిర్ణయించినట్లుగానే అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. టెట్ పరీక్షకు దరఖాస్తులు వెల్లువెత్తాయని తెలిపారు. ఆగస్టు 3తో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగియగా.. 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీకి సిద్ధమైన ఏపీ సర్కార్ మరోసారి టెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జులై 2న టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన విద్యాశాఖ ఆగస్టు 3 వరకు దరఖాస్తులు స్వీకరించింది.