చలికాలంలో చాలామంది సీజనల్ వ్యాధులతో బాధపడుతుంటారు. జ్వరం వచ్చిందంటే చాలు పారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. వీటిని వాడటం వల్ల గుండె, మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. అలాగే నోరు, పేగుల వంటి అవయవాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ మాత్రల కారణంగా హార్ట్ ఫెయిల్యూర్ పెరగవచ్చని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.