నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో త్రుటిలో ప్రమాదం తప్పింది. పత్తి లోడుతో వెళ్తున్న ఓ లారీ పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం సంభవించిన సమయంలో లారీకి సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో లారీని పక్కకు తీసి ట్రాఫిక్ క్లియర్ చేశారు.