AP: తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మీడియా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని తెలిసి విచారణకు ఆదేశించారని, తనతో పాటు ఉన్నవారు కూడా తనని నమ్మలేదని అన్నారు. కానీ తనను కొంతమంది నమ్మారు అది చాలని చెప్పారు. అయితే ఇటీవల లక్ష్మి అనే మహిళ లైంగిక వేధించాడంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.