ఏపీ డిజిటల్ గవర్నెన్స్‌పై మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జనవరిలో 161 సేవలతో ప్రారంభించామని గుర్తుచేశారు. 200 సేవలు అందించే అద్భుత మైలురాయి సాధించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ గవర్నెన్స్ శక్తికి ఇదో నిదర్శనం అని లోకేశ్ వెల్లడించారు. సామాన్యుల ప్రయోజనం కోసం ఈ పౌర- కేంద్రీకృత సేవలు విస్తరిస్తూనే ఉంటామని అన్నారు. మన మిత్ర కోసం 9552300009కు సందేశం పంపాలని మంత్రి సూచించారు.