మాజీ సీఎం
జగన్ పార్టీ నేతలకు కీలక సందేశం ఇచ్చారు. ప్రజలతోనే ఉండాలని.. ఉందామని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీల గురించి ప్రజలు త్వరలోనే అర్థం చేసుకుంటారని
జగన్ వ్యాఖ్యానించారు. తనను 16 నెలలు అక్రమంగా జైల్లో పెడితే ప్రజలు ఆదరించారని గుర్తు చేశారు. నాడు
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 23 మంది
వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకున్నారని.. వారి పరిస్థితి ఏమైందని
జగన్ ప్రశ్నించారు.