గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై పన్ను విధించి మినహాయించినందుకు యూనియన్ బ్యాంక్ మేనేజర్‌పై ఒక వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. దీంతో బ్యాంక్ మేనేజర్‌ను అతడు కొట్టాడు. అతడి తల్లితో పాటు అక్కడున్న వారు వారిని విడిపించేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.