చాలామంది పచ్చళ్లను ఎక్కువగా తింటుంటారు. కూరలు ఉన్నప్పటికీ నిల్వ పచ్చళ్ళని ఇష్టంగా పెట్టుకుని భోజనం చేస్తుంటారు. అయితే పచ్చళ్లను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిల్వ పచ్చళ్ళు తింటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. పచ్చళ్లు ఎక్కువగా తినేవారిలో కడుపులో మంట, ఎసిడిటీ సమస్య వస్తుంది. ముఖ్యంగా బిపి, డయాబెటిస్ పెరిగి.. కిడ్నీ, గుండెపోటు సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు.