వైసీపీ హయాంలో పనిచేసిన పలువురు ఉన్నతాధికారులపై కేసులు నమోదవుతున్నాయి. వారి అరెస్టులు జరుగుతున్నాయి. అయితే దీని ప్రభావం ప్రస్తుతం ఉన్న అధికారులపై పడుతుండటం గమనార్హం. ఉచిత ఇసుక, మద్యం వ్యవహారాలు సహా ఇతర కీలక పనుల విషయంలో ఉన్నతాధికారులు సంతకాలు చేయడానికి ముందుకు రావడం లేదు. రేపు తమ పరిస్థితి ఏంటని కొందరు అధికారులు తల్లడిల్లుతున్నారు. దీంతో అధికారులపై సర్కార్ దూకుడు మంచిదేనా? అనే చర్చ జరుగుతుంది.