ఈ గ్రామంలో గంగమ్మ జాతర నిర్వహిస్తే.. వర్షం పడాల్సిందే!

81చూసినవారు
ఈ గ్రామంలో గంగమ్మ జాతర నిర్వహిస్తే.. వర్షం పడాల్సిందే!
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తరిగోపుల గ్రామం నుంచి రామసముద్రం వెళ్లే రోడ్డు మార్గంలో గంగమ్మ గుడి వెలిసింది. ఈ ఊరిలో వర్షం కోసం గంగమ్మ జాతర నిర్వహిస్తే చాలు.. ఖచ్చితంగా వాన కురుస్తుందని ఆ గ్రామ ప్రజల నమ్మకం. గ్రామమంతా తిరిగి భిక్షాటన చేసి బియ్యం, కందిపప్పు, నిత్యావసర సరుకులు సేకరిస్తారు. వాటితో నైవేధ్యం చేసి అమ్మవారికి సమర్పిస్తారు. జాతర నిర్వహించిన 2, 3 రోజుల తర్వాత వర్షం కురుస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్