అల్లూరి సీతారామరాజు జిల్లా పనుకురాతిపాలెం గ్రామస్థులు ప్రాణాలను పణంగా పెట్టి వాగు దాటుతున్నారు. గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దూరు వాగు ప్రవాహం పెరిగింది. దీంతో వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను గ్రామస్థులు ఈ రోజు టైర్ ట్యూబులో కూర్చోబెట్టి అవతలి ఒడ్డుకు తరలించారు. ప్రభుత్వం వంతెనను నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.