ప్రాణ స్నేహితుడు తన రెండో భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. హరిప్రసాద్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. రెండో భార్యతో తన స్నేహితుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అది తట్టుకోలేక హరిప్రసాద్ సూసైడ్ నోట్, వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు హరిప్రసాద్ మొదటి భార్య వరలక్ష్మి ద్వారకా పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.