అమానుషం.. హోంవర్క్ చేయలేదని బాలుడికి వాతలు

83చూసినవారు
అమానుషం.. హోంవర్క్ చేయలేదని బాలుడికి వాతలు
AP: హోంవర్క్ చేయలేదని బాలుడికి టీచర్ వాతలు పెట్టింది. అవి పుండ్లుగా మారడంతో బాలుడు తీవ్ర అవస్థలు పడుతున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాలాజీరావుపేటలో చోటు చేసుకుంది. సంతనూతలపాడులో సచివాలయ ఉద్యోగిగా పని చేసే గౌతమికి దేవాష్ అనే కొడుకు ఉన్నాడు. 3వ తరగతి చదువుతున్న దేవాష్‌ను టీచర్ సాబిరా కొట్టింది. గౌతమి టీచర్‌కు ఫోన్ చేసి అడగ్గా వాగ్వాదం జరిగింది. ఆపై టీచర్ భర్త తనకు కాల్ చేసి బెదిరించినట్లు గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్