ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన మహారాష్ట్రలో బస్సులు, ఆటోలు, క్యాబ్ ఛార్జీలను పెంచారు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడుపుతున్న బస్సుల ఛార్జీలు 14.95 శాతం మేర పెరిగాయి. హైక్ కమిటీ ప్రతిపాదించిన బస్సు ఛార్జీల పెంపును ఆ రాష్ట్ర ఆర్టీసీ శుక్రవారం ఆమోదించింది. దీంతో శనివారం నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పెరిగిన ఛార్జీలపై ఆర్టీసీ బస్సు ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.