AP: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్‌ఆర్టీసీకి సుదీర్ఘకాలం పాటు సేవలందించిన విశ్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జమ్ముల అయ్యన్న (85) శుక్రవారం కన్నుమూశారు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో పనిచేసిన ఆయన తన పదవీకాలంలో నిజాయితీపరుడైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విజయవాడ ప్రైవేటు సిటీ బస్సు రవాణాను జాతీయీకరించడంలో అయ్యన్న కీలక భూమిక పోషించారు. ఆయన హయాంలోనే విజయవాడ బస్టాండ్ రూపు దిద్దుకుంది.