ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేతగా మాడిసన్ కీస్ నిలిచింది. శనివారం మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అరీనా సబలెంకాపై 6-3, 2-6, 7-5 తేడాతో విజయం సాధించింది. అమెరికాకు చెందిన మాడిసన్ కీస్‌కు ఇది తొలి గ్రాండ్ స్లామ్ కావడం విశేషం.