పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం?

17232చూసినవారు
పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం?
మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. నేటితో పిన్నెల్లి మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. అయితే పిన్నెల్లి పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికల ముందు తర్వాత జరిగిన గొడవల్లో పిన్నెల్లిపై నాలుగు కేసులు నమోదైయ్యాయి. ఈవీఎం ధ్వంసం కేసులో ఏ1గా పిన్నెల్లి ఉన్నారు. అయితే హైకోర్టు పలువురు టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు కౌంటింగ్ వరకు రిలీఫ్ ఇచ్చింది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టు తప్పుబట్టింది. దీంతో నరసరావుపేటలో పిన్నెల్లి నివాసం ఉంటున్న అనిల్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్