ఏపీ చరిత్రలో ఇలాంటి అన్యాయమైన పాలన ఎప్పుడు చూడలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించిన అనంతరం ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెడ్ బుక్‌లో పేర్లు రాసుకొని కక్ష తీర్చుకుంటున్నారని అన్నారు. 'రెడ్ బుక్ మీరు ఒక్కరే పెట్టుకుంటారని మీరు అనుకుంటున్నారేమో.. రెడ్ బుక్ పెట్టుకోవడమనేది చాలా సులభమైన పని. అదేమి పెద్ద ఘనకార్యం కాదు.. గొప్ప పని కాదు' అని ఫైర్ అయ్యారు.