జగన్ విధ్వంస పాలనతో దాన్ని బ్రేక్ చేశారు: లోకేశ్

76చూసినవారు
జగన్ విధ్వంస పాలనతో దాన్ని బ్రేక్ చేశారు: లోకేశ్
AP: ప్రజాస్వామ్య స్ఫూర్తిని జగన్ విధ్వంస పాలనతో బ్రేక్ చేశారని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చాక గత బకాయిలు చెల్లించనని మొండికేశారని లోకేశ్ చెప్పారు. టీడీపీ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి పనులు నిలిపివేశారని మండిపడ్డారు. ఇలాంటి నిరంకుశ మనస్తత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు. తాము అధికారంలోకి రాగానే జగన్ పెట్టిన బకాయిలను చెల్లించామన్నారు. ప్రభుత్వం మారినా.. అభివృద్ధి, సంక్షేమాలు కొనసాగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్