వరలక్ష్మీ శరత్ కుమార్ తన చిన్నతనంలో జరిగిన చేదు అనుభవాలను ఓ టీవీ షోలో పంచుకున్నారు. బాల్యంలో కొందరు వ్యక్తులు తనని లైంగికంగా వేధించారని కన్నీరు పెట్టుకున్నారు. ఒక కంటెస్టెంట్ తన చిన్నతనంలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని బాధపడ్డారు. అది చూసిన వరలక్ష్మీ తనకు కూడా అలానే జరిగిందని 'నీది నాది ఒకటే కథ' అని ఎమోషనల్ అయ్యారు. దీనికి సమబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.