ఏపీలోని కూటమి సర్కారు పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి రాయితీ రుణ పథకాల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ తప్పనిసరి చేసింది. అలాగే, హిజ్రాలకు జీవనోపాధి కల్పనకుగాను వారిచేత ప్రత్యేకంగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయించాలని నిర్ణయం తీసుకుంది. కాగా, టీడీపీ ప్రభుత్వం 2014-19లో వారితో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయించిన తాజాగా ప్రస్తావించింది.