ఏపీలోని నర్సింగ్ విద్యా సంస్థలకు మంత్రి సత్యకుమార్ వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలు అతిక్రమించిన యాజమాన్యాలకు నోటీసులు జారీచేయడంతో పాటు, లోపాలున్న విద్యాసంస్థలు వాటిని సరిదిద్దుకోవడానికి 2 నెలల గడువు ఇస్తూ హెచ్చరికలు జారీ చేశారు. లేదంటే 2025-26 విద్యా సంవత్సరానికి ఆయా కాలేజీల్లో ప్రవేశాలను అనుమతించొద్దని స్పష్టం చేశారు. కాగా, 427 ప్రైవేట్ సంస్థలు పేరెంట్ ఆసుపత్రుల వివరాల్ని సమర్పించలేదని అధికారులు గుర్తించారు.