ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సందేశం ఇచ్చారు. 'నీటిని పొదుపుగా వాడుకోవాలి, భూగర్భ జలాలను కాపాడుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాను. అనవసర దుర్వినియోగం నివారించి, గ్రౌండ్ వాటర్ సంరక్షణకు ప్రయత్నించాలి. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కార్యక్రమాల్లో పాల్గొని, ప్రతి చుక్కను కాపాడి, భవిష్యత్ తరాలకు ఇబ్బందులు లేకుండా చూడాలి' అని అన్నారు.