నిన్నటి దాకా విజయవాడలో ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటన, ఇప్పుడు శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిపారనే ఘటన ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఈ రెండు ఘటనల్లో వేళ్లన్నీ వైసీపీ నేతల వైపే చూపిస్తున్నాయని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి బెంగళూరుకు వెళ్లిపోయారు. అధికారం కోల్పోయాక ఈ వంద రోజుల్లోనే ఆయన తన సతీమణి భారతితో కలిసి పదోసారి బెంగళూరు తరలిపోయారు.