ఎంపీలకు జగన్ దిశానిర్దేశం

81చూసినవారు
ఎంపీలకు జగన్ దిశానిర్దేశం
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అమరావతిలో ఆ పార్టీ ఎంపీలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కచ్చితంగా తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందుతామని అన్నారు. మన పాలన, చంద్రబాబు పాలనను ప్రజలు కచ్చితంగా గమనిస్తారని చెప్పారు. ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికం అని ఎంపీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.