తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. తీవ్రమైన కడుపునొప్పి రావడంతో మంగళవారం ఉదయం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ముగ్గురు వైద్యుల బృందం పొత్తి కడుపు కింది భాగంలో స్టెంట్స్ వేసినట్టు సమాచారం. ఆపరేషన్ సక్సెస్ అయిందని, ఆయన మరో మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.