సీఎం చంద్రబాబు నాలుగు నెలల పాలనపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. అమరావతిలో పార్టీ నేతలతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందన్నారు. తమ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కూటమి పాలన వచ్చిన తర్వాత శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పారు. చంద్రబాబు పాలన దేవుడికి కూడా ఆగ్రహం తెప్పిస్తోందని విమర్శించారు.