ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. చెరువులు సంరక్షణే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన హైడ్రా వరుస కూల్చివేతలతో దూకుడు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రాలోనూ హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల బుడమేరు వరదలతో విజయవాడ నగరం నీట మునిగింది. ఈ నేపథ్యంలో బుడమేరు నుంచే ఏపీ ప్రభుత్వం కూల్చివేతల పర్వాన్ని మొదలుపెట్టనుంది తెలుస్తోంది.