వైసీపీ నుంచి గెలిచిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఈ రెండు పోస్టులు ఖాళీ అయినట్లుగా తొందరలోనే ప్రకటన రానుంది. ఈ రెండు రాజ్యసభ ఎంపీ పోస్టుల కోసం టీడీపీ కూటమిలోని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. అందులో టీడీపీ తరపున గల్లా జయదేవ్, జనసేన తరపున నాగబాబు ఎంపీ పోస్టుల బరిలో ఉన్నట్లు తెలుస్తోంది.